![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -163 లో.... చక్రి ఇంటికి డల్ గా వస్తాడు. ఏమైందిరా నీ ప్రేమ విషయం తనకి చెప్పవా అని కేశవ అడుగుతాడు. లేదని చక్రి అంటాడు. మరి ఎందుకు డల్ గా ఉన్నావని కేశవ కన్నా ఆటపట్టిస్తారు. దాంతో వాళ్ళపై మాధవ కోప్పడతాడు. మహా ఇంట్లోకెళుతుంది. తను వెళ్ళిపోతే మొన్న వాడు ఎంత బాధపడ్డాడు వాడిని ఎందుకు అలా చేస్తున్నారని కేశవ, కన్నా పై మాధవ కోప్పడతాడు....
ఆ తర్వాత ఉదయం మహా కాఫీ తాగుతుంటే ఏంటమ్మా ఏం జరిగింది.. చక్రి, నువ్వు డల్ గా ఉన్నారు.. వాడు ఏమైనా అన్నాడా అని మహాని మాధవ అడుగుతాడు. లేదు పెద్ది ఇప్పుడే గా లేచిందని మహా అంటుంది. ఆ తర్వాత మహాకి ఆధార్ కార్డ్ కొరియర్ వస్తుంది. అందులో అడ్రెస్ చేంజ్ తో పాటు వైఫ్ అఫ్ చక్రి అని ఉంటుంది. అది చూసి చక్రిపై మహా కోప్పడుతుంది. ఇదంతా నీ పనే అని చున్నీతో కుర్చీకి తనని కట్టేస్తుంది. నేను ఏం చెయ్యలేదని చక్రి అంటాడు. ఆ తర్వాత మహా వెళ్ళాక.. ఇదంతా నీ పనే కదా అని కన్నా అనగానే అవునని చక్రి అంటాడు. ఆ తర్వాత ఆఫీస్ లో మహా దగ్గరికి దివ్య వెళ్లి ఏం తప్పు చేసావ్ విక్కీ కోపంగా ఉన్నాడని అంటుంది. మహా లోపలికి వెళ్ళగానే విక్కీ సీరియస్ అయినట్లు యాక్టింగ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పి కేక్ కటింగ్ ప్లాన్ చేస్తాడు. ఈ రోజు పార్టీ ఖర్చు మొత్తం నాదే అని విక్కీ అంటాడు. విక్కీకి నువ్వు అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అని మహాతో దివ్య అనగానే అదేం లేదని మహా అంటుంది.
ఆ తర్వాత మహాని తీసుకొని చక్రి తన ఓనర్ ఓంకారేశ్వర్ దగ్గరికి వెళ్తాడు. డ్రైవింగ్ లైసెన్స్ కావాలని చెప్తాడు. దాంతో తన ముందు బాగా డ్రైవ్ చేస్తేనే ఇప్పిస్తానని అతను అనగానే మహా డ్రైవ్ చేస్తుంది. చివర్లో ఒకతనికి డాష్ ఇస్తుంది కానీ చక్రి అతనిదే తప్పు అని పంపిస్తాడు. ఆ తర్వాత శైలుతో కేశవ ఫోన్ మాట్లాడుతుంటే అప్పుడే కన్నా విని మహాని పిలుచుకొని వస్తాడు. ఇద్దరు కలిసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటారు. తరువాయి భాగంలో మహాని శైలు అన్నయ్య ఏడిపిస్తాడు. చున్నీ లాక్కుంటాడు. దాంతో మహా బురుదలో పడుతుంది. ఆ విషయం ఇంటికి వచ్చి మహా చెప్పగానే కోపంతో చక్రి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |